రైల్వే కాలనీ విఘ్నేశ్వర యూత్ మండపంలో ఘనంగా కుంకుమ పూజలు, అన్నదానం
- ఐ కన్వెన్షన్ సమీపంలో భక్తిశ్రద్ధలతో వేడుకలు
- దాతలు సారబు ఆంజనేయులు, అరుణ దంపతులు*
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు21 సెప్టెంబర్, 202601:57 AM

స్టేషన్ ఘనపూర్ 21 సెప్టెంబర్ ప్రజాధ్వని: పట్టణంలోని రైల్వే కాలనీలోని ఐ కన్వెన్షన్ సమీపంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలోని వినాయక మండపంలో ఆదివారం కుంకుమ పూజలు, అన్నదాన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి వినాయకుడికి ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించగా, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని గణనాథుడిని భక్తిశ్రద్ధలతో పూజించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదానానికి సారబు ఆంజనేయులు - అరుణ దంపతులు దాతలుగా వ్యవహరించారు. సుమారు 200 మందికి పైగా భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు. భక్తి పాటలు, కోలాహలం మధ్య రైల్వే కాలనీ మొత్తం భక్తి పారవశ్యంతో నిండిపోయింది.

ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కొంగరి రాజు, చిట్టిమల్ల నాగేష్, ఎడ్ల వెంకటస్వామి, కొంగరి రవితేజ, కొంగరి సతీష్, ఎడ్ల పూర్ణచందర్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

