ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    కలెక్టరేట్‌లో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు

    • జనగామ కలెక్టరేట్‌లో నిర్వహించిన వేడుకలకు హాజరైన మల్కాపూర్ వాల్మీకి కుల పెద్దలు
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు27 అక్టోబర్, 202604:06 AM

    జనగామ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన వాల్మీకి కుల పెద్దలు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

    కలెక్టరేట్‌లో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు
    చిల్పూర్, అక్టోబర్ 26 ప్రజాధ్వని : జనగామ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన వాల్మీకి కుల పెద్దలు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహర్షి బోధనలు, ఆశయాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో పాల్గొని వేడుకలను విజయవంతం చేసిన వారందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కుల పెద్దలు పెనుకుల యాదగిరి, భోగి వెంకటమల్లయ్య, పెనుకుల రాజు, భోగి రాజయ్య, ఉప సర్పంచుల మండల ఫోరం అధ్యక్షుడు పశుల వెంకటేశ్వర్లు, వాల్మీకి సంఘం అధ్యక్షుడు కెంగర్ల మల్లేష్, బలంతుల లక్ష్మణ్, బలంతుల కిషన్, గుజ్జుల నాగేశ్వర్‌రావు, కెంగర్ల అనిల్, అరుణ్, నాగరాజు, అజయ్‌తో పాటు పలువురు వాల్మీకి కుల బాంధవులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: