ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    ఎమ్మెల్సీ ఓటరు నమోదు బాధ్యతలు స్టేషన్‌ ఘన్‌పూర్‌ కోఆర్డినేటర్‌గా విజయ్‌

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు18 అక్టోబర్, 202610:05 AM

    గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు యూత్‌ కాంగ్రెస్‌ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. నల్లగొండ–వరంగల్‌–ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు…

    ఎమ్మెల్సీ ఓటరు నమోదు బాధ్యతలు స్టేషన్‌ ఘన్‌పూర్‌ కోఆర్డినేటర్‌గా విజయ్‌
    స్టేషన్‌ ఘన్‌పూర్‌, అక్టోబర్‌ 18 ప్రజాధ్వని: గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు యూత్‌ కాంగ్రెస్‌ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. నల్లగొండ–వరంగల్‌–ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు యూత్‌ కాంగ్రెస్‌ నాయకులకు వార్‌రూమ్‌ ఇన్‌ఛార్జ్‌లు, కోఆర్డినేటర్లుగా బాధ్యతలు అప్పగించింది. ఇందులో భాగంగా స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఇల్లందుల విజయ్‌ను నియమించారు. పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో విస్తృతంగా చేపట్టి, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా కృషి చేయాలని తెలంగాణ ప్రదేశ్‌ యూత్‌ కాంగ్రెస్‌ ఆదేశించింది. ఈ ప్రక్రియను సమన్వయంతో, సమర్థవంతంగా పూర్తి చేసేలా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని సూచించింది.
    మీ స్పందన:

    షేర్ చేయండి: