ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    తెలంగాణ

    సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు14 నవంబర్, 202604:45 PM

    తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు, దర్శకుడు, నిర్మాత గిరిబాబు (80) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం…

    సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత
    రాయపర్తి, నవంబర్ 14 ప్రజాధ్వని:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు, దర్శకుడు, నిర్మాత గిరిబాబు (80) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

    ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానం

    1946 జూన్ 8న ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో జన్మించిన గిరిబాబు అసలు పేరు యర్రా శేషగిరిరావు. చిన్ననాటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్న ఆయన సినిమాలపై మక్కువతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1973లో విడుదలైన 'జగమే మాయ' చిత్రంతో ప్రతినాయకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్యనటుడిగా విభిన్న పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా సాగిన తన సినీ ప్రస్థానంలో 600కు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. 'నువ్వే కావాలి', 'అప్పు చేసి పప్పు కూడు', 'అల్లుడా మజాకా', 'నిన్నే పెళ్లాడతా', 'ఆవిడా మా ఆవిడే', 'లిటిల్ సోల్జర్స్', 'భైరవ ద్వీపం', 'కితకితలు' తదితర చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి.

    నటుడిగానే కాకుండా దర్శక నిర్మాతగా..

    నటనతో పాటు దర్శకత్వం, నిర్మాణ రంగాల్లోనూ గిరిబాబు తన ప్రతిభను చాటుకున్నారు. పలు చిత్రాలను నిర్మించి, మరికొన్ని సినిమాలకు దర్శకత్వం వహించి తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. విలన్‌గా ప్రారంభమైన ఆయన ప్రయాణం విభిన్న పాత్రలతో ఐదు దశాబ్దాల పాటు కొనసాగింది. ఆయన మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ ఓ విలక్షణ నటుడిని కోల్పోయింది. గిరిబాబు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: