ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    అంబేద్కర్–జగ్జీవన్ రామ్ ఇద్దరూ దళితుల అభివృద్ధికి రెండు కళ్లంటి వారు: MLA కడియం శ్రీహరి

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు5 ఏప్రిల్, 202608:05 AM
    అంబేద్కర్–జగ్జీవన్ రామ్ ఇద్దరూ దళితుల అభివృద్ధికి రెండు కళ్లంటి వారు: MLA కడియం శ్రీహరి
    స్టేషన్ ఘనపూర్ ఏప్రిల్ 05 ప్రజాధ్వని: దళితుల సమగ్రాభివృద్ధికి డా. బీఆర్ అంబేద్కర్, డా. బాబు జగ్జీవన్ రామ్ ఇద్దరూ రెండు కళ్లలాంటి వారని మాజీ ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి బడుగు వర్గాలకు మార్గం చూపగా, ఆ రాజ్యాంగం ఫలాలు ప్రజలకు చేరేలా కృషి చేసిన నాయకుడు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. స్టేషన్ ఘనపూర్ పట్టణంలో నిర్వహించిన డా. బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన, మహనీయుడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ, సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన జగ్జీవన్ రామ్ చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా ఎదిగి దేశానికి విశేష సేవలందించారని గుర్తుచేశారు. దళిత, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఏర్పాటు చేయించారని, రేషన్ షాపుల ద్వారా పేదలకు నిత్యావసర సరుకులు అందించే విధానానికి శ్రీకారం చుట్టినవారిలో ఆయన ముందున్నారని తెలిపారు. దళితులు పరిపాలన చేయలేరనే అపోహలను చెదరగొట్టి, ఏ శాఖ ఇచ్చినా సమర్థంగా నిర్వహించిన నాయకుడిగా నిలిచారని అన్నారు.
    జగ్జీవన్ రామ్ ఆశయాల సాధనకు సమాజం మొత్తం కృషి చేయాలని పిలుపునిచ్చిన శ్రీహరి, తాను సోషల్ వెల్ఫేర్ మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో వంద గురుకుల పాఠశాలలు ప్రారంభించడంతో పాటు ఉన్నవాటిని ఇంటర్ స్థాయికి అప్‌గ్రేడ్ చేసినట్లు తెలిపారు. 2016లో అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 125 ఎస్సీ గురుకులాల ఏర్పాటుకు కృషి చేశానని వెల్లడించారు. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న జగ్జీవన్ రామ్ విగ్రహం స్థానంలో 2027 ఏప్రిల్ 5 నాటికి కొత్త కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే అంబేద్కర్, జగ్జీవన్ రామ్ పేరుతో రూ.2 కోట్ల వ్యయంతో ఆధునిక సదుపాయాలతో భవన నిర్మాణం చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: