గన్నారంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
- పూల పండుగలో మహిళలు, యువతుల సందడి.. ఆటపాటలతో కోలాహలం
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు18 అక్టోబర్, 202604:10 PM
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలను రాయపర్తి మండలం గన్నారం గ్రామంలో ఆదివారం మహిళలు ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ దుస్తులు ధరించి మహిళలు, యువతులు ఉత్సాహంగా సంబరాల్లో…

రాయపర్తి, అక్టోబర్ 18 (ప్రజాధ్వని): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలను రాయపర్తి మండలం గన్నారం గ్రామంలో ఆదివారం మహిళలు ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ దుస్తులు ధరించి మహిళలు, యువతులు ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్నారు. తంగేడు, గునుగు, బంతి, చామంతి తదితర పూలతో బతుకమ్మలను ఆకర్షణీయంగా అలంకరించారు. అనంతరం ఒకచోట చేరి బతుకమ్మల చుట్టూ తిరుగుతూ సంప్రదాయ పాటలు పాడుతూ ఆటలాడారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు, యువతుల కేరింతలతో వేడుకలు సందడిగా సాగాయి. అనంతరం సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేసి పండుగను ముగించారు. ఈ వేడుకల్లో గ్రామ సర్పంచ్ గడ్డం విజయ, వార్డు సభ్యులు, గ్రామ మహిళలు, యువతులు తదితరులు పాల్గొన్నారు.
