ఆల్ ఇండియా ఎమ్మార్పీఎస్ బలోపేతానికి కొత్త నియామకాలు
- చిల్పూర్ మండల అధ్యక్షులుగా మచ్చ అంజయ్య మాదిగ,
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు12 జూన్, 202601:06 PM

చిల్పూర్, జూన్ 12 ప్రజాధ్వని : ఆల్ ఇండియా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూలై 7న ఆంధ్రప్రదేశ్లోని ఈదుముడి గ్రామంలో నిర్వహించనున్న మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జేరిపోతుల విల్సన్ మాదిగ పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో, రాష్ట్ర అధ్యక్షుడు చిట్టుపాక ప్రభాకర్ మాదిగ ఆదేశాల మేరకు ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా చిల్పూర్ మండలంలోని పల్లగుట్ట మర్రిపల్లిగూడెం గ్రామానికి చెందిన మచ్చ వేణు మాదిగను జిల్లా ప్రధాన కార్యదర్శిగా, మచ్చ అంజయ్య మాదిగను మండల అధ్యక్షుడిగా, మచ్చ హరీష్ మాదిగను మండల ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా నియమిస్తూ నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలువేరు ఆశీర్వాదం మాదిగ, రాష్ట్ర కార్యదర్శి ఎడ్ల సమ్మయ్య మాదిగ, మచ్చ ఇద్దమయ్య, మచ్చ చేరాలు, మచ్చ వెంకటస్వామి, సోంపల్లి వెంకటస్వామి, మచ్చ డేవిడ్, గుర్రం రాజేష్, మచ్చ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
