ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    మండల వార్తలు

    ఘనంగా వల్లాల రాజు జన్మదిన వేడుకలు

    • పెద్దపెండ్యాలలో కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు25 అక్టోబర్, 202602:47 PM

    హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ మండలం పెద్దపెండ్యాల గ్రామంలో బీఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడు వల్లాల రాజు జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా గ్రామంలో కేక్‌ కట్‌ చేసి రాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

    ఘనంగా వల్లాల రాజు జన్మదిన వేడుకలు
    ధర్మసాగర్‌, అక్టోబరు 25 (ప్రజాధ్వని): హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ మండలం పెద్దపెండ్యాల గ్రామంలో బీఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడు వల్లాల రాజు జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా గ్రామంలో కేక్‌ కట్‌ చేసి రాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామాభివృద్ధితో పాటు పార్టీ బలోపేతానికి వల్లాల రాజు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. ఆయన ఆయురారోగ్యాలతో, మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు వేలూరి కేశవరెడ్డి, కందుల సమ్మిరెడ్డి, టీఆర్‌ఎస్‌ రాజయ్య, పుండ్రు వీరారెడ్డి, ఏడెల్లి లోకేష్‌రెడ్డి, ఆకారపు ఆరోగ్యం, కందుల జైపాల్‌రెడ్డి, మఠం రాజు, ఆకారపు నరేష్‌కుమార్‌, ఆకారపు ప్రశాంత్‌, గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: