ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    మండల వార్తలు

    ఐలమ్మ కుటుంబానికి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆర్థిక చేయూత

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు1 నవంబర్, 202612:26 PM

    అనారోగ్యంతో మృతి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు భాషబోయిన సమ్మయ్య తల్లి భాషబోయిన ఐలమ్మ కుటుంబానికి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అండగా నిలిచింది. రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు ఆదివారం తిరుమలాయపల్లి గ్రామంలోని ఐలమ్మ నివాసానికి…

    ఐలమ్మ కుటుంబానికి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆర్థిక చేయూత
    రాయపర్తి, నవంబర్ 1 (ప్రజాధ్వని): అనారోగ్యంతో మృతి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు భాషబోయిన సమ్మయ్య తల్లి భాషబోయిన ఐలమ్మ కుటుంబానికి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అండగా నిలిచింది. రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు ఆదివారం తిరుమలాయపల్లి గ్రామంలోని ఐలమ్మ నివాసానికి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి చేరుకున్నారు. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ తరఫున రూ.3,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల నాయకుడు లేతకుల రంగారెడ్డి, మాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడు దోకుడు దేవేందర్, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు దొంతరబోయిన యాదగిరి, గ్రామ ఉపసర్పంచ్ బక్క బుచ్చమ్మ, ఎల్లయ్య, భాషబోయిన ఎల్లయ్య, నంకరబోయిన బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: