వరుణ్ తేజ్ కుటుంబానికి అండగా కాంగ్రెస్ ఇన్‌చార్జి సింగపురం ఇందిరా
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు24 జూన్, 202607:45 AM

స్టేషన్ ఘన్‌పూర్, జూన్ 24 ప్రజాధ్వని : స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీకి చెందిన చింత వరుణ్ తేజ్ ఇటీవల ప్రమాదవశాత్తు ఈతకు వెళ్లి మృతి చెందడం ఆ కుటుంబానికి తీరని లోటని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీమతి సింగపురం ఇందిరా అన్నారు. మృతుడి కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు తన వంతు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. యువకుడి మృతితో తీవ్ర విషాదంలో ఉన్న తల్లిదండ్రులను ఓదార్చిన ఇందిరా, కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు సింగపురం నాగయ్య, సీనియర్ నాయకులు సింగపురం వెంకటయ్య, చింత ఎల్లయ్య, చింత జోగి, సింగపురం సందీప్, రాజు కుమార్, రాజవరపు ప్రసాద్, చింత రాజు, చింత శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
