ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆదరణ.. బీజేపీ భూస్థాపితం ఖాయం

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు8 ఆగస్టు, 202603:13 PM
    కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆదరణ.. బీజేపీ భూస్థాపితం ఖాయం
    జనగామ, ఆగస్టు 8: దేశంలో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోందని వరంగల్‌ ఎంపీ డా. కడియం కావ్య అన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ భూస్థాపితం కావడం ఖాయమని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్‌ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. జనగామ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ, పట్టణ, మండల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
    కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆదరణ.. బీజేపీ భూస్థాపితం ఖాయం - అదనపు చిత్రం 1
    సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ కడియం కావ్య
    రాహుల్‌గాంధీ ప్రజా సమస్యలపై చివరి వరకు పోరాటం చేస్తున్నారని, పేద విద్యార్థులు, పేపర్‌ లీకేజీలు వంటి అంశాలపై ఆయన చేస్తున్న పోరాటాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని కడియం కావ్య ఆరోపించారు. పార్లమెంట్‌లో కీలకమైన బిల్లులను మ్యాగీ నూడిల్స్‌లా రెండు మూడు నిమిషాల్లోనే ఆమోదిస్తున్నారని విమర్శించారు. ఎంపీల అభిప్రాయాలకు, ప్రజల ప్రయోజనాలకు విలువ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, డీలిమిటేషన్‌ అంశం వెనుక బీజేపీ రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు.
    కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆదరణ.. బీజేపీ భూస్థాపితం ఖాయం - అదనపు చిత్రం 2
    కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా నియామక పత్రం తీసుకుంటున్న గడ్డమీది సురేష్
    బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు కాంగ్రెస్‌కు దొంగదెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నాయని కడియం కావ్య ఆరోపించారు. కాంగ్రెస్‌ శ్రేణులు వ్యక్తిగత విభేదాలు, గ్రూపు రాజకీయాలను పక్కనపెట్టి ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. కాంగ్రెస్‌ జెండాను ఎగరేయడమే ప్రతి కార్యకర్త లక్ష్యంగా పనిచేయాలని, పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు సముచిత గౌరవం ఉంటుందని స్పష్టం చేశారు. నూతన కార్యవర్గాలు సమన్వయంతో పనిచేసి పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని కోరారు.
    కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆదరణ.. బీజేపీ భూస్థాపితం ఖాయం - అదనపు చిత్రం 3
    స్టేషన్ ఘనపూర్ మండల అధ్యక్షులుగా నియమాక పత్రం అందుకుంటున్న శిరీష్ రెడ్డి
    ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో వరంగల్‌ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని కడియం కావ్య తెలిపారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు సుమారు రూ.6,500 కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
    కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆదరణ.. బీజేపీ భూస్థాపితం ఖాయం - అదనపు చిత్రం 4
    కాంగ్రెస్ పార్టీ చిల్పూర్ మండల అధ్యక్షులుగా చిర్ర నాగరాజ్
    ఈ కార్యక్రమంలో సభాధ్యక్షురాలు, డీసీసీ అధ్యక్షురాలు లకావత్‌ ధన్వంతి, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ రాంబాబు, వైటీడీఏ బోర్డు సభ్యుడు లక్ష్మీనారాయణ నాయక్‌, జనగామ మున్సిపల్‌ చైర్మన్‌ బాలమణి, స్టేషన్‌ ఘనపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ వినయ్‌, స్టేషన్‌ ఘనపూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ లావణ్య శిరీష్‌రెడ్డి, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, మండల అధ్యక్షులు, డీసీసీ కమిటీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ట్రెజరర్‌, అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: