దూడల ఆరోగ్యానికి నట్టల నివారణ మందు
- మల్కాపూర్‌లో దూడలకు నట్టల నివారణ మందు తాపించిన పశువైద్య సిబ్బంది
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు4 నవంబర్, 202602:05 AM
పశువుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా మండలంలోని మల్కాపూర్ గ్రామంలో మంగళవారం దూడలకు నట్టల నివారణ మందు తాపించారు. నట్టల కారణంగా దూడల్లో వచ్చే అనారోగ్య సమస్యలను అరికట్టడంతో పాటు, అవి ఆరోగ్యంగా ఎదిగేందుకు ఈ మందు ఎంతగానో ఉపయోగపడుతుందని పశువైద్యాధికారి అన్వేష్…

చిల్పూర్, నవంబర్ 3 (ప్రజాధ్వని): పశువుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా మండలంలోని మల్కాపూర్ గ్రామంలో మంగళవారం దూడలకు నట్టల నివారణ మందు తాపించారు. నట్టల కారణంగా దూడల్లో వచ్చే అనారోగ్య సమస్యలను అరికట్టడంతో పాటు, అవి ఆరోగ్యంగా ఎదిగేందుకు ఈ మందు ఎంతగానో ఉపయోగపడుతుందని పశువైద్యాధికారి అన్వేష్ తెలిపారు. ఈ సందర్భంగా పశువుల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్రమం తప్పకుండా నట్టల నివారణ మందులు తాపించడం వల్ల కలిగే ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించారు. పశువుల ఆరోగ్యం పట్ల రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫయాజుద్దీన్, జగ్మల్, రజాక్, డెయిరీ ఫార్మర్ రైతు పశుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
