జూడోలో కేజీబీవీ రాయపర్తి విద్యార్థుల ప్రతిభ
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు3 అక్టోబర్, 202601:51 AM

రాయపర్తి, అక్టోబర్ 2 (ప్రజాధ్వని): 70వ ఎస్‌జీఎఫ్ స్కూల్ గేమ్స్ జూడో పోటీల్లో రాయపర్తి మండలం తిరుమలాయపల్లి గ్రామంలోని కేజీబీవీ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. పాఠశాల నుంచి మొత్తం ఆరుగురు విద్యార్థులు జూడో పోటీల్లో పాల్గొనగా, వారిలో ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. మరో విద్యార్థి పోటీల్లో రెండో స్థానాన్ని సాధించి పాఠశాలకు గుర్తింపు తీసుకొచ్చారు. విద్యార్థుల విజయంపై కేజీబీవీ ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులను అభినందిస్తూ, ఇదే స్ఫూర్తితో రాష్ట్రస్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు జూడోలో శిక్షణ అందించిన ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయురాలిని కూడా వారు ప్రత్యేకంగా అభినందించారు.
