అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి: సర్పంచ్ హరిబాబు
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు19 నవంబర్, 202607:37 AM
మండలంలోని తమ్మడపల్లి (ఐ) గ్రామంలో నూతనంగా మంజూరైన పెన్షన్లకు సంబంధించిన మంజూరు పత్రాలను సర్పంచ్ రడపాక హరిబాబు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానన్నారు.

జాఫర్‌గఢ్, నవంబరు 19 (ప్రజాధ్వని): మండలంలోని తమ్మడపల్లి (ఐ) గ్రామంలో నూతనంగా మంజూరైన పెన్షన్లకు సంబంధించిన మంజూరు పత్రాలను సర్పంచ్ రడపాక హరిబాబు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానన్నారు. వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న పెన్షన్ దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హత సాధించి మంజూరైన వారికి పత్రాలు అందజేసినట్లు పేర్కొన్నారు. నూతనంగా పెన్షన్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ హరిబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు, పెన్షన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.
