చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న చిర్ర రమేష్‌ను పరామర్శించిన యువజన నాయకుడు కేశిరెడ్డి రాకేష్ రెడ్డి
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు19 మే, 202607:56 AM

చిల్పూర్ మే 19 ప్రజాధ్వని : చిల్పూర్ మండలం నష్కల్ గ్రామానికి చెందిన చిర్ర రమేష్ అనారోగ్యంతో బాధపడుతుండగా, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలోని నీలిమ హాస్పటల్లో వైద్యం అందించారు. చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న చిర్ర రమేష్‌ను జనగామ యువజన నాయకుడు కేశిరెడ్డి రాకేష్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పారు. అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు జనగామ యాదగిరి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రంగు హరీష్, మండల నాయకులు చిర్ర రాజు, ఆరూరి స్వామి, ఎడ్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
