ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    కుర్చపల్లిలో ఘనంగా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు14 ఏప్రిల్, 202603:44 PM
    కుర్చపల్లిలో ఘనంగా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ
    రఘునాథపల్లి ఏప్రిల్ 14 ప్రజాధ్వని : రఘునాథపల్లి మండలం కుర్చపల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. సభకు పార్నంది అశోక్ అధ్యక్షత వహించగా, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల్ల ఉపేందర్, జిల్లా అధ్యక్షుడు పైసా రాజశేఖర్, ఎంఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి జెరిపోతుల సుధాకర్, జీడీ రమేష్, ఆదాం, అశోక్ అలాగే విగ్రహ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు కొట్టె ప్రేమ్ కుమార్, ఉపాధ్యక్షులు తోకల సుధాకర్, తోకల అనిల్, ప్రధాన కార్యదర్శి తోకల అనిల్. నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: