ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    తెలంగాణ

    వేయి స్తంభాల ఆలయానికి రూ.14.44 కోట్లు నిధులు_ ఎంపీ కడియం కావ్య

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు6 ఏప్రిల్, 202610:35 AM
    వేయి స్తంభాల ఆలయానికి రూ.14.44 కోట్లు నిధులు_ ఎంపీ కడియం కావ్య
    హనుమకొండ, ఏప్రిల్ 6 ప్రజాధ్వని : చారిత్రక ప్రాధాన్యం కలిగిన హనుమకొండలోని వేయి స్తంభాల గుడి అభివృద్ధికి కేంద్రం నుంచి రూ.14.44 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధుల సాధనలో వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య కీలక పాత్ర పోషించారు. ఆలయం ప్రాంగణంలోని కల్యాణ మండపం అభివృద్ధి, విస్తరణతో పాటు మిగిలిన పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు ఈ నిధులు వినియోగించనున్నారు. కాకతీయుల కాలం నాటి శిల్ప వైభవాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా పనులు కొనసాగనున్నాయి.
    వేయి స్తంభాల ఆలయానికి రూ.14.44 కోట్లు నిధులు_ ఎంపీ కడియం కావ్య  - అదనపు చిత్రం 1
    ఈ నిధుల కోసం ఎంపీ కడియం కావ్య పలుమార్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిసి వినతులు సమర్పించినట్లు సమాచారం. పురావస్తు శాఖ అధికారులతో కలిసి ఆలయాన్ని స్వయంగా పరిశీలించి, పునరుద్ధరణ అవసరాలపై నివేదికను కేంద్రానికి అందజేశారు. ఇటీవల పురావస్తు శాఖ టెండర్లు పిలవడంతో పనుల ప్రారంభానికి మార్గం సుగమమైంది. ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య కేంద్ర మంత్రి, పురావస్తు శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు. వేయి స్తంభాల గుడి అభివృద్ధితో పర్యాటక రంగం విస్తరించడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని ఎంపీ పేర్కొన్నారు. “వారసత్వాన్ని కాపాడుతూ అభివృద్ధి” లక్ష్యంతో మరిన్ని ప్రాజెక్టులు సాధించేందుకు కృషి కొనసాగిస్తామని తెలిపారు.
    వేయి స్తంభాల ఆలయానికి రూ.14.44 కోట్లు నిధులు_ ఎంపీ కడియం కావ్య  - అదనపు చిత్రం 3
    మీ స్పందన:

    షేర్ చేయండి: