ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    మండల వార్తలు

    సీతాఫల్‌ మండిలో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు

    • ఆడపడుచుల ఆటపాటలు.. కోలాటాలతో మార్మోగిన ప్రాంతం
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు18 అక్టోబర్, 202605:00 PM

    తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు సికింద్రాబాద్‌ పరిధిలోని సీతాఫల్‌ మండి ప్రాంతంలో అంబరాన్నంటాయి. తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో నిర్వహించే బతుకమ్మ పండుగ ముగింపు సందర్భంగా మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో…

    సీతాఫల్‌ మండిలో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు
    రాయపర్తి, అక్టోబరు 18 ప్రజాధ్వని: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు సికింద్రాబాద్‌ పరిధిలోని సీతాఫల్‌ మండి ప్రాంతంలో అంబరాన్నంటాయి. తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో నిర్వహించే బతుకమ్మ పండుగ ముగింపు సందర్భంగా మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సంబరాల్లో పాల్గొన్నారు. సీతాఫల్‌ మండిలోని శ్రీనివాస నిలయం సమీపంలో మహిళలు తంగేడు, గునుగు, బంతి, చామంతి తదితర రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మల చుట్టూ వలయంగా చేరి పాటలు పాడుతూ సందడి చేశారు.
    సీతాఫల్‌ మండిలో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు - అదనపు చిత్రం 1
    'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో' అంటూ ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. కోలాటాలు, సంప్రదాయ నృత్యాలతో మహిళలు చేసిన సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆడపడుచుల కేరింతలు, చప్పట్లతో సీతాఫల్‌ మండి ప్రాంతమంతా పండుగ శోభను సంతరించుకుంది.
    సీతాఫల్‌ మండిలో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు - అదనపు చిత్రం 2
    తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సాగిన ఈ వేడుకలు స్థానికులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మహంకాళి అనిత, రక్షిత, తురగా భవాని, త్రిష, దుర్గ, శ్రీదర్శిని, ప్రీతి, బిందు, అశ్వ తదితరులు పాల్గొన్నారు.
    సీతాఫల్‌ మండిలో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు - అదనపు చిత్రం 4
    మీ స్పందన:

    షేర్ చేయండి: