ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    తెలంగాణ

    వేం నరేందర్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ, ఎమ్మెల్యే

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు5 మార్చి, 202602:38 PM
    వేం నరేందర్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ, ఎమ్మెల్యే
    హైదరాబాద్, మార్చి 5 ప్రజాధ్వని: కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యునిగా ఎంపికైన ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డిని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా. కడియం కావ్య, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి రాజ్యసభ సభ్యునిగా ఎంపికైనందుకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జనగామ డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, మాజీ పీఏసీఎస్ చైర్మన్ కరుణాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: