పోయిరా బొడ్డెమ్మ.. పోయిరావమ్మా!
- తొమ్మిది రోజుల పాటు ఘనంగా బొడ్డెమ్మ వేడుకలు
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు10 అక్టోబర్, 202605:14 AM

రాయపర్తి, అక్టోబర్ 10, ప్రజాధ్వని: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తిరుమలాయపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీ ఏడో వార్డులో నిర్వహించిన బొడ్డెమ్మ వేడుకలు శుక్రవారం రాత్రి ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు మహిళలు, బాలికలు ప్రతిరోజూ సాయంత్రం బొడ్డెమ్మ చుట్టూ తిరుగుతూ జానపద పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. చివరి రోజు బొడ్డెమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం వీడ్కోలు పాటలు పాడుతూ పసుపు, కుంకుమ, ఓడి బియ్యం, రవిక, పసుపు కుంకుమ సామగ్రి, పండ్లు తదితరాలను సమర్పించి ఆటోలో గ్రామ సమీపంలోని నీటి వనరు వద్దకు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ వేడుకలతో కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ వేడుకల్లో బరిగల భవాని, యాదమ్మ, ఉమ, వశపాక లావణ్య, శ్వేత, అనసూర్య, సుగుణమ్మ, వెంకటమ్మ, పూలమ్మ, వంగాల సునిత, తాటికాయల శ్రీలత, శిరీష, చిట్టి, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
