చదువుకున్న నాటి స్నేహం.. కష్టకాలంలో ఆపన్నహస్తం!
- స్నేహితురాలి కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సాయం..
- 2008-09 పదో తరగతి బ్యాచ్ మానవత్వం
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు22 అక్టోబర్, 202602:23 PM
కష్టసమయంలో ఆప్తులుగా అండగా నిలిచి బాల్య స్నేహితులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. తమతో కలిసి చదువుకున్న స్నేహితురాలి కుటుంబంలో విషాదం నెలకొనడంతో స్పందించిన 2008-09 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆర్థిక సహాయం అందించి ఆదర్శంగా నిలిచారు.

బురహాన్‌పల్లి అక్టోబరు 22 (ప్రజాధ్వని): కష్టసమయంలో ఆప్తులుగా అండగా నిలిచి బాల్య స్నేహితులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. తమతో కలిసి చదువుకున్న స్నేహితురాలి కుటుంబంలో విషాదం నెలకొనడంతో స్పందించిన 2008-09 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆర్థిక సహాయం అందించి ఆదర్శంగా నిలిచారు. బురహాన్‌పల్లి గ్రామానికి చెందిన దొమ్మాటి స్వాతి తండ్రి దొమ్మాటి రామూర్తి ఇటీవల మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న స్వాతి బాల్య స్నేహితులు వెంటనే స్పందించారు. తోటి విద్యార్థులంతా కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, తమ వంతు సహాయంగా రూ.25 వేల నగదును స్వాతి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో చొప్పెర మధుకర్, బండి రాజు, గుడెల్లి నరేశ్, కుంట రాజు, ఎండీ రఫీ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
