కాంగ్రెస్ కు షాక్.. భారీగా బీఆర్‌ఎస్‌లోకి చేరికలు
- కండువాలు కప్పి ఆహ్వానించిన పల్లా, రాజయ్య, ఎర్రబెల్లి
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు7 అక్టోబర్, 202601:36 PM

స్టేషన్‌ఘన్‌పూర్, అక్టోబర్ 7, ప్రజాధ్వని: స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నమిలిగొండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరారు. నియోజకవర్గ నాయకులు శీలం శ్యామ్, ఓగ్గు రాజు ఆధ్వర్యంలో 18 మంది బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే డా.పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డా.తాటికొండ రాజయ్య, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రజా సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం ప్రజలతో కలిసి నిరంతరం పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తాటికొండ రాజయ్య మాట్లాడుతూ ప్రజలతో మమేకమై పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. బీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో కోటే తిరుపతి, బత్తిని సత్యనారాయణ, బొమ్మెర సంపత్, చిక్కుడు ఎల్లయ్య, పురుమాని రవి, పురుమాని వెంకన్న, డ్యాగల రాజేందర్, కోల వెంకటేష్, సముద్రాల యాకూబ్ పాషా, మినుముల నర్సయ్య, గుండె నరసయ్య, కోల గట్టయ్య, గాదె మహేష్, గాదె శివాజీ, తాళ్లపల్లి సాయిలు, గాదె ప్రణయ్, గాదె వంశీధర్ ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మాచర్ల గణేష్, నాయకులు కనకం గణేష్, జబ్బార్, ఆగారెడ్డి, గుండె మల్లేష్, గాదె రాజు, చిట్టిబాబు, గట్టు కృష్ణసాయి తదితరులు పాల్గొన్నారు.
