అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి
- నూతన పెన్షన్ మంజూరు పత్రాలు పంపిణీ చేసిన సర్పంచ్ ఇల్లందుల తిరుపతమ్మ
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు19 నవంబర్, 202603:08 AM
చిల్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామంలో నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్ల పత్రాలను గ్రామ సర్పంచ్ ఇల్లందుల తిరుపతమ్మ గురువారం లబ్ధిదారులకు అందజేశారు. పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హత పొందిన వారికి ప్రభుత్వం మంజూరు చేసిన పత్రాలను పంపిణీ చేశారు.

చిన్నపెండ్యాల, నవంబర్ 19 (ప్రజాధ్వని): చిల్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామంలో నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్ల పత్రాలను గ్రామ సర్పంచ్ ఇల్లందుల తిరుపతమ్మ గురువారం లబ్ధిదారులకు అందజేశారు. పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హత పొందిన వారికి ప్రభుత్వం మంజూరు చేసిన పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ తిరుపతమ్మ మాట్లాడుతూ.. గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని తెలిపారు. వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న పెన్షన్ దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నూతన పెన్షన్ మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పెన్షన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.
