ఆంధ్రా తుఫాన్ బాధితుల సేవలో తెలంగాణ గుత్తేదార్లు
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు1 నవంబర్, 202602:12 AM
పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదు రోజుల క్రితం వచ్చిన అర్నబ్ సైక్లోన్ తుఫాన్ వల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిన విషయం అందరికీ తెలిసినదే.దీంతో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రం సహాయం కోరడంతో వెంటనే స్పందించిన తెలంగాణ…

స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్ 31 (ప్రజాధ్వని ): పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదు రోజుల క్రితం వచ్చిన అర్నబ్ సైక్లోన్ తుఫాన్ వల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిన విషయం అందరికీ తెలిసినదే.దీంతో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రం సహాయం కోరడంతో వెంటనే స్పందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర విద్యుత్ శాఖను అప్రమత్తం చేసింది.
తెలంగాణ ఎన్‌పీడీసీఎల్ జనగామ జిల్లా నుండి ఆంధ్రా ప్రాంతంలోని అమలాపురం జిల్లాకు 30 కిలోమీటర్ల దూరంలో గల ఉప్పలగుప్తం మండలంలో తుఫాన్ ప్రభావానికి సరఫరాలో అంతరాయం ఏర్పడిన 33/11 కేవీ ఉప్పలగుప్తం విద్యుత్ ఉప కేంద్రం పరిధిలో పునరుద్ధరణ పనులు వేగవంతం చేస్తున్నారు.
జనగామ ఏడీఈ/డీపీఈ శంకర్ పర్యవేక్షణలో స్టేషన్ ఘన్‌పూర్ (కేఎస్ఆర్ ఎంటర్‌ప్రైజెస్) విద్యుత్ గుత్తేదార్ కే. అమరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో 50 మంది కార్మికులు తుఫాన్ ప్రభావిత ప్రాంతానికి చేరుకొని విద్యుత్ సరఫరా పునరుద్ధీకరణ పనులు చేస్తున్నారు.ఈ సందర్భంగా గుత్తేదార్ అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ ...తాము ఎన్‌పీడీసీఎల్ జనగామ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ చెరుకు సంపత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడికి చేరుకొని విద్యుత్ పనులు చేస్తున్నామని తెలిపారు.ఎలాంటి ఫలితం ఆశించకుండా ఈ పని చేయడమే తమ ఉద్దేశమని, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలనే సంకల్పంతో వెంటనే సామగ్రితో బయలుదేరి వచ్చామన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమం తమ మనసుకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని, కష్టాల్లో ఉన్న పక్క రాష్ట్ర ప్రజలకు సహాయం చేసే అవకాశం కల్పించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.వీరితో పాటు ఈ కార్యక్రమంలో జనగామ ప్రాంతానికి చెందిన గుత్తేదార్ వసీమ్ అక్తర్ మరియు కార్మికులు ఉన్నారు.
