ఎల్‌నినో పేరుతో తెలంగాణను ఎడారిగా మార్చారు
- చంద్రబాబుకు గురుదక్షిణగా ఏపీకి నీళ్లు తరలిస్తున్నారు
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు25 అక్టోబర్, 202610:04 AM
ఎల్‌నినో ప్రభావం పేరుతో తెలంగాణ రైతులను సాగునీటికి దూరం చేస్తూ రాష్ట్రాన్ని ఎడారిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ తాటికొండ రాజయ్య రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబరు 25 (ప్రజాధ్వని): ఎల్‌నినో ప్రభావం పేరుతో తెలంగాణ రైతులను సాగునీటికి దూరం చేస్తూ రాష్ట్రాన్ని ఎడారిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ తాటికొండ రాజయ్య రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి తన రాజకీయ గురువు చంద్రబాబునాయుడుకు గురుదక్షిణగా తెలంగాణ నీటిని ఆంధ్రప్రదేశ్‌కు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్సీ ఎన్నికల కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మేడిగడ్డ వద్ద ప్రస్తుతం 20 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉందని, జూన్ 19న కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించిన సమయంలోనూ 95 మీటర్ల ఎత్తులో నీటి ప్రవాహం ఉన్నప్పటికీ నీటిని ఎత్తిపోయలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.

