ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    మండల వార్తలు

    రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నిరసన దిష్టిబొమ్మ దహనం..

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు30 సెప్టెంబర్, 202606:21 AM
    రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నిరసన దిష్టిబొమ్మ దహనం..
    రఘునాథపల్లి, సెప్టెంబర్‌ 29 ప్రజాధ్వని: శ్రీరాముడు, పరమశివుడిపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రఘునాథపల్లి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు దిష్టిబొమ్మ దహనం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు పిలుపు మేరకు మండల అధ్యక్షుడు పుప్పాల వేణుకుమార్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. హిందూ దేవుళ్లను రాజకీయాలకు ఉపయోగించడం, వారి మధ్య విభజన రేఖలు గీసేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తెలంగాణలో ‘దక్షిణ కాశీ’గా వేములవాడ, ‘దక్షిణ అయోధ్య’గా భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయని గుర్తుచేశారు. శ్రీరాముడు, పరమశివుడిని ఉత్తర, దక్షిణ ప్రాంతాలుగా విభజించేలా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఎన్నికల సమయంలో ప్రజల ఓట్ల కోసం దేవుళ్లను సాక్షులుగా పెట్టుకుని హామీలు ఇచ్చారని, ఇప్పుడు అదే దేవుళ్ల పేరుతో ప్రజలను విభజించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కులం, ప్రాంతం పేరుతో సమాజంలో విభేదాలు సృష్టించే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. శ్రీరాముడు, పరమశివుడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని హిందూ సమాజానికి సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ఉడుత రంజిత్‌యాదవ్‌, సీనియర్‌ నాయకులు వల్లాల ఉపేందర్‌, ఆకుల రామచందర్‌, యామంకి కొమురెల్లి, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి మేడిపల్లి వెంకటేష్‌, కావటి ప్రవీణ్‌, తోట మహేష్‌, చెవ్వ రాజు, బోళ్ల అఖిల్‌, గణేష్‌, సుధాకర్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: