తాటికొండ సున్నం యాదగిరికి జనగాం జిల్లా ఎస్సీ సెల్ సెక్రెటరీ పదవి
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు26 ఆగస్టు, 202602:10 PM

జనగాం ఆగష్టు 26 ప్రజాధ్వని : నూతన జనగాం జిల్లా ఎస్సీ సెల్ సెక్రెటరీగా తాటికొండ సున్నం యాదగిరి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, జిల్లా అధ్యక్షులు ధన్వంతికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి జిల్లా ఎస్సీ సెల్ సెక్రెటరీగా బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, ఎస్సీ వర్గాల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని యాదగిరి పేర్కొన్నారు.
