ఆంథోనీ హైస్కూల్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు22 ఏప్రిల్, 202605:55 AM

చిల్పూర్, ప్రజాధ్వని : జనగాం జిల్లా చిల్పూర్ మండలం చిన్న పెండ్యాల గ్రామంలోని సెయింట్ ఆంథోనీ హైస్కూల్ (సహస్ర)లో ఎల్కేజీ, నర్సరీ, యూకేజీ చిన్నారుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల చైర్మన్ రాజారపు ప్రభుదేవ్ ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నతనం నుంచే విద్యపై ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. డైరెక్టర్ రాజారపు అనూష కూడా చిన్నారులను అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఫ్రాంక్, ఉపాధ్యాయులు రాధిక, నీలిమ, శ్వేత, మాయ, సంధ్య, రాజకుమారి పాల్గొన్నారు. చిన్నారుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను వీక్షించారు.
