ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    వెంకటాద్రిపేటలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం..

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు2 నవంబర్, 202610:31 AM

    జనగామ జిల్లా చిల్పూర్ మండలం వెంకటాద్రిపేట గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు కొడిశాల రవి ఆధ్వర్యంలో నిర్వహించారు.

    వెంకటాద్రిపేటలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం..
    చిల్పూర్, నవంబర్ 2 (ప్రజాధ్వని): జనగామ జిల్లా చిల్పూర్ మండలం వెంకటాద్రిపేట గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు కొడిశాల రవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎంపీటీసీ వెన్నకూస కుమార్ పరిశీలించి, గ్రామంలోని పట్టభద్రులను కలిసి ఓటరు నమోదుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలను పట్టభద్రులకు వివరించారు. అదేవిధంగా గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాలని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కొడిశాల రవి, మాజీ ఎంపీటీసీ వెన్నకూస కుమార్, చిల్పూర్ గుట్ట దేవస్థాన కమిటీ డైరెక్టర్ గుడెల్లి అరుణ, రమేష్ రెడ్డి, వార్డు సభ్యుడు వడ్డేపల్లి పవన్, మంతెన లవన్, వెంకట్ రెడ్డి, రమణారెడ్డి, ప్రసాద్ రెడ్డి, పున్నం చందర్ రెడ్డి, రఘు, రత్నాకర్, పట్టభద్రుల ఓటర్లు హర్షవర్ధన్ రెడ్డి, నూనె దేవరాజు, సాంబరాజు తదితరులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: