ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    సైనికుల కుటుంబానికి ఆర్టీఐ పరిరక్షణ కమిటీ అండ

    • ఇంటి నంబర్ మార్పుపై రికార్డుల సేకరణకు మూడు జిల్లాల కమిటీల చర్యలు
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు18 సెప్టెంబర్, 202603:08 PM
    సైనికుల కుటుంబానికి ఆర్టీఐ పరిరక్షణ కమిటీ అండ
    జనగామ, సెప్టెంబర్ 18 (ప్రజాధ్వని): దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు సైనికుల కుటుంబానికి సంబంధించిన ఇంటి నంబర్ మార్పు వ్యవహారంపై సమాచార హక్కు పరిరక్షణ కమిటీ దృష్టి సారించింది. పాత, ప్రస్తుత రికార్డులను పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు, సమస్య పరిష్కారానికి చట్టబద్ధమైన మార్గాల్లో సహకరిస్తామని జనగామ, వరంగల్, ఖమ్మం జిల్లాల కమిటీ అధ్యక్షులు మహమ్మద్ జావిద్, కాటా కుమారస్వామి, శ్రీధర్ కాసోజు తెలిపారు. దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న కుటుంబానికి చెందిన చిన్న కుమారుడు ఫోన్‌ ద్వారా కమిటీ ప్రతినిధులను సంప్రదించి సమస్యను వివరించినట్లు వారు తెలిపారు. సరిహద్దుల్లో విధులు నిర్వహించడం వల్ల కుటుంబ సమస్యపై అధికారులను స్వయంగా కలవడం కష్టంగా ఉందని, కుటుంబానికి ఇబ్బందులు ఎదురవుతున్నందున న్యాయం జరిగేలా సహకరించాలని సైనికుడు కోరినట్లు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కమిటీ ప్రతినిధులు సమస్యను పూర్తిగా పరిశీలించి, అధికారిక రికార్డుల ఆధారంగా వాస్తవాలను వెలికితీసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
    4-15 నుంచి 4-15/1, 4-15/2గా ఎందుకు మారింది?
    ఇంటి నంబర్‌కు సంబంధించిన పాత, ప్రస్తుత రికార్డులను పరిశీలించాల్సిన అవసరం ఉందని కమిటీ ప్రతినిధులు తెలిపారు. మొదట 4-15 ఇంటి నంబర్ ఎవరికి కేటాయించారు? ఏ సంవత్సరంలో కేటాయించారు? 1990 నుంచి ఇప్పటి వరకు ఇంటి పన్ను ఎవరి పేరుతో నమోదైంది? పన్ను ఎవరు చెల్లించారు? పాత రికార్డుల్లో మార్పులు జరిగాయా? ప్రస్తుతం 4-15/1, 4-15/2గా ఇంటి నంబర్ మార్చడానికి కారణం ఏమిటి? అనే అంశాలపై అధికారిక సమాచారం సేకరించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఇంటి నంబర్ మార్పు కోసం ఎవరు దరఖాస్తు చేశారు, దరఖాస్తు చేసిన తేదీ, దానిని పరిశీలించిన అధికారి, మార్పునకు ఆధారమైన ఉత్తర్వులు, అనుమతులు, పాత–కొత్త రికార్డుల్లో యజమానుల పేర్ల నమోదు తదితర వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించనున్నట్లు వెల్లడించారు. ఈ వ్యవహారంపై సమాచార హక్కు చట్టం–2005 కింద జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి దరఖాస్తు సమర్పించి, ఇంటి నంబర్‌కు సంబంధించిన పాత, ప్రస్తుత రికార్డులతో పాటు మార్పుకు సంబంధించిన దరఖాస్తులు, అనుమతులు, ఉత్తర్వులు, పన్ను రికార్డులు తదితర వివరాలను కోరనున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికుల కుటుంబానికి అవసరమైన సహకారం అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని జనగామ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ జావిద్, వరంగల్ జిల్లా అధ్యక్షులు కాటా కుమారస్వామి, ఖమ్మం జిల్లా అధ్యక్షులు శ్రీధర్ కాసోజు తెలిపారు. కుటుంబానికి అన్యాయం జరిగిందా? లేదా? అనే అంశం అధికారిక రికార్డుల పరిశీలనతో స్పష్టమవుతుందని పేర్కొన్నారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు సమాచార హక్కు చట్టం, ఇతర చట్టబద్ధమైన మార్గాల్లో అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: