బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ భరోసా
- ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరామర్శ.. సిమెంట్ అందిస్తామని హామీ
- ఆర్థిక సాయం అందించిన నగరబోయిన శ్రీరాములు
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు6 సెప్టెంబర్, 202610:50 AM

స్టేషన్‌ఘన్‌పూర్, సెప్టెంబరు 6 ప్రజాధ్వని : జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం రాఘవపూర్ గ్రామంలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఓ నిరుపేద కుటుంబానికి చెందిన రేకుల షెడ్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో బాధిత కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. గ్రామానికి చెందిన బెజ్జం రాజు–రజిత దంపతులు రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నిత్యం మాదిరిగానే కూలీ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఎవరూ లేని వేళ విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ సంభవించింది. దీంతో రేకులతో నిర్మించిన షెడ్ పూర్తిగా కాలిపోయింది. ఇంట్లోని వస్తువులు కూడా అగ్నికి ఆహుతైనట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం, పార్టీ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడంతోపాటు, ఇంటి పునర్నిర్మాణానికి 50 బస్తాల సిమెంట్ అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకుడు నగరబోయిన శ్రీరాములు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటామని, అవసరమైన సహాయం అందించేందుకు కృషి చేస్తామని భరోసా కల్పించారు.
