ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    మత్స్యకారుల అభివృద్ధే లక్ష్యం: అధ్యక్షుడు చిక్కుడు రమేష్

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు13 ఏప్రిల్, 202611:53 AM

    అధ్యక్షులు చిక్కుడు రమేష్

    మత్స్యకారుల అభివృద్ధే లక్ష్యం: అధ్యక్షుడు చిక్కుడు రమేష్
    శివునిపల్లి, ఏప్రిల్ 13: గ్రామంలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి నూతన కమిటీని ఎన్నుకున్నారు. సంఘం అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమం దృష్ట్యా ఈ కమిటీ కీలక పాత్ర పోషించనుంది. సంఘం అధ్యక్షుడిగా చిక్కుడు రమేష్ ఎన్నిక కాగా, ఉపాధ్యక్షులుగా చెన్నూరి వేణు (బోరింగ్), కార్యదర్శి పిట్టల అశోక్ బాధ్యతలు స్వీకరించారు. డైరెక్టర్లుగా నీల రాజు, భూర్ల శ్రీనివాస్, గోరంతల చంద్రు, వేయ్యి సోమయ్య, పిట్టల వెంకటేశ్వర్లు (మద్దెల), కోండ రాజు ఎంపికయ్యారు.
    మత్స్యకారుల అభివృద్ధే లక్ష్యం: అధ్యక్షుడు చిక్కుడు రమేష్ - అదనపు చిత్రం 1
    మత్స్య పారిశ్రామిక సహకార సంఘ నూతన కమిటీ
    ఈ సందర్భంగా అధ్యక్షుడు చిక్కుడు రమేష్ మాట్లాడుతూ… తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రతి సభ్యుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం, వారి జీవనోపాధి మెరుగుదలే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గ్రామంలోని చెరువుల అభివృద్ధి, చేపల ఉత్పత్తి పెంపు, ఆధునిక పద్ధతుల అమలు ద్వారా ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తానన్నారు. అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న మత్స్యపాలన పథకాలను ప్రతి లబ్ధిదారుడికి చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మత్స్యకారులకు అవసరమైన శిక్షణలు, సబ్సిడీ సౌకర్యాలు, రుణాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. సంఘ సభ్యులందరినీ కలుపుకుని పారదర్శకంగా పనిచేస్తూ, శివునిపల్లి మత్స్య రంగాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తానని హామీ ఇచ్చారు. సభ్యులు కూడా కొత్త కమిటీపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తూ, గ్రామంలో మత్స్య రంగం మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: