కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు26 సెప్టెంబర్, 202601:13 PM

స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 26 ప్రజాధ్వని: కాంగ్రెస్ పార్టీలోకి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తల చేరికలు కొనసాగుతున్నాయి. చిల్పూర్ మండలం రాజవరం గ్రామానికి చెందిన సుమారు 30 మంది బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిర్ర నాగరాజు, చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు ఆధ్వర్యంలో శనివారం మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమక్షంలో వారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అదేవిధంగా బీజేపీ బజరంగ్‌దళ్ జిల్లా ఉపాధ్యక్షుడు నాయిని అశోక్‌తో పాటు బీఆర్‌ఎస్‌కు చెందిన మరో 30 మంది నాయకులు, కార్యకర్తలు హనుమకొండలోని కనకదుర్గ కాలనీలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాసంలో కాంగ్రెస్‌లో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విధానాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై అన్ని వర్గాల ప్రజలు పార్టీలో చేరుతున్నారని అన్నారు. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఉపయోగపడుతున్నాయనడానికి పార్టీలోకి జరుగుతున్న చేరికలే నిదర్శనమని పేర్కొన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు అందరం కలిసి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షుడు గడ్డమీది సురేష్, రాజవరం గ్రామ శాఖ అధ్యక్షుడు ఎల్లయ్య, ఆలయ కమిటీ డైరెక్టర్లు సూర్యనారాయణ, యాదగిరి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
