ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    మండల వార్తలు

    భూక్య యాకుబ్ చిత్రపటానికి నివాళులర్పించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు7 అక్టోబర్, 202602:08 PM
    భూక్య యాకుబ్ చిత్రపటానికి నివాళులర్పించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
    రాయపర్తి, అక్టోబర్‌ 7, ప్రజాధ్వని: రాయపర్తి మండలం వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకుడు భూక్య యాకుబ్‌ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మాజీ మంత్రి, పాలకుర్తి నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి ఎర్రబెల్లి దయాకర్‌రావు బుధవారం బోడుప్పల్‌లోని యాకుబ్‌ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా యాకుబ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. యాకుబ్‌ పార్టీ కోసం చేసిన సేవలను ఈ సందర్భంగా నాయకులు గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి, పల్లా సుందర్‌రాంరెడ్డి, బబ్బూరి శ్రీకాంత్‌గౌడ్‌, రాజేష్‌ నాయక్‌, సురేందర్‌ రాథోడ్‌, వంగల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: