స్టేషన్ ఘన్పూర్ ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడిగా గుర్రం ఫాతి కుమార్ నియామకం
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు14 నవంబర్, 202604:30 PM
జనగామ: స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడిగా మాజీ ఎంపీటీసీ గుర్రం ఫాతి కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు వేముల మల్లేశం చేతుల మీదుగా ఆయన నియామక ఉత్తర్వుల ప్రతిని అందుకున్నారు.

జనగామ నవంబర్ 14 ప్రజాధ్వని : స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడిగా మాజీ ఎంపీటీసీ గుర్రం ఫాతి కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు వేముల మల్లేశం చేతుల మీదుగా ఆయన నియామక ఉత్తర్వుల ప్రతిని అందుకున్నారు. ఈ సందర్భంగా గుర్రం ఫాతి కుమార్ మాట్లాడుతూ తనకు ఈ పదవి రావడానికి సహకరించిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లాకావత్ దన్వంతి, చిల్పూర్ గుట్ట దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్, వైస్ చైర్మన్ నీలా రాజమ్మ గట్టయ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంబటి కిషన్ రాజులతో పాటు కౌన్సిలర్లు, జిల్లా అనుబంధ సంఘాల నాయకులు, పట్టణ ముఖ్య నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఎస్సీ సెల్ బలోపేతానికి, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
