ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    మండల వార్తలు

    చిల్పూర్‌ నూతన ఎస్‌ఐకు బీఆర్‌ఎస్‌ నేతల అభినందనలు

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు22 అక్టోబర్, 202612:43 PM

    చిల్పూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్‌ఐ శ్రవణ్‌ను బీఆర్‌ఎస్‌ చిల్పూర్‌ మండల పార్టీ ఇన్‌చార్జి మాలోత్‌ రమేష్‌ నాయక్‌ ఆధ్వర్యంలో మండల పార్టీ ముఖ్య నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.

    చిల్పూర్‌ నూతన ఎస్‌ఐకు బీఆర్‌ఎస్‌ నేతల అభినందనలు
    చిల్పూర్‌, అక్టోబరు 22 (ప్రజాధ్వని): చిల్పూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్‌ఐ శ్రవణ్‌ను బీఆర్‌ఎస్‌ చిల్పూర్‌ మండల పార్టీ ఇన్‌చార్జి మాలోత్‌ రమేష్‌ నాయక్‌ ఆధ్వర్యంలో మండల పార్టీ ముఖ్య నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ శ్రవణ్‌కు శుభాకాంక్షలు తెలియజేసి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా మండల నాయకులు మాట్లాడుతూ.. చిల్పూర్‌ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్‌ శాఖ అందించే సేవలు మరింత చేరువ కావాలని పేర్కొన్నారు. ప్రజలు, పోలీసుల మధ్య సత్సంబంధాలు కొనసాగుతూ, గ్రామీణ ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు రాజన్‌బాబు, లింగంపల్లి, కొండాపూర్‌, కృష్ణాజిగూడెం గ్రామాల సర్పంచులు, లాలు నాయక్‌, దేవేందర్‌, మల్లం రవి, మరపాక రమేష్‌, మర్రి శ్రీధర్‌, వివిధ గ్రామాల వార్డు సభ్యులు, గ్రామ అధ్యక్షులు, పార్టీ ఇన్‌చార్జులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మహిళా నాయకులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    చిల్పూర్‌ నూతన ఎస్‌ఐకు బీఆర్‌ఎస్‌ నేతల అభినందనలు - అదనపు చిత్రం 2
    మీ స్పందన:

    షేర్ చేయండి: