ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    కేసీఆర్‌ హయాంలో నూతన గ్రామపంచాయతీలకు మహర్దశ_ మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ మాలోతు రమేష్ నాయక్

    • తండాలు, గూడేలకు పంచాయతీ హోదాతో స్వయం పాలనకు బాటలు
    • దేవ్ జి తండాలో కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు17 సెప్టెంబర్, 202612:24 PM
    కేసీఆర్‌ హయాంలో నూతన గ్రామపంచాయతీలకు మహర్దశ_ మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ మాలోతు రమేష్ నాయక్
    చిల్పూర్‌, సెప్టెంబరు 17 (ప్రజాధ్వని): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హయాంలో గ్రామపంచాయతీలకు పెద్దపీట వేశారని బీఆర్‌ఎస్‌ నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని జనగామ జిల్లా చిల్పూర్‌ మండలం దేవ్ జి తండాలో కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ఇన్చార్జ్ మలోత్ రమేష్‌ నాయక్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో గ్రామాలు స్వయం పాలన దిశగా ముందుకు సాగాయని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త గ్రామపంచాయతీలను ఏర్పాటు చేయడంతోపాటు తండాలు, గూడేలకు పంచాయతీ హోదా కల్పించిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానిదేనని రమేష్‌ నాయక్‌ తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టర్‌, ట్రాలీ, వాటర్‌ ట్యాంకర్‌ అందించడం ద్వారా పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో నర్సరీలు, డంప్‌యార్డులు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి మౌలిక వసతులను మెరుగుపరిచారని వివరించారు. అదేవిధంగా గ్రామపంచాయతీలకు ప్రత్యేక భవనాలు నిర్మించడం, పారిశుధ్య నిర్వహణను బలోపేతం చేయడం, గ్రామస్థాయిలోనే పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పించడం వంటి చర్యలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడ్డాయని అన్నారు. సర్పంచులకు నేరుగా నిధులు అందించడం ద్వారా గ్రామాల అభివృద్ధికి మరింత ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. కేసీఆర్‌ తీసుకొచ్చిన నూతన పంచాయతీరాజ్‌ చట్టం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రమేష్‌ నాయక్‌ పేర్కొన్నారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం గ్రామపంచాయతీలకు తగినన్ని నిధులు విడుదల చేయకపోవడంతో పంచాయతీల పరిస్థితి బలహీనపడుతోందని ఆయన విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం తక్షణమే పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో లింగంపల్లి సర్పంచ్‌ సునీత-లాలు నాయక్‌, ఉపసర్పంచ్‌ వురడి రాజు, మండల నాయకులు బాత్తుల రాజన్‌ బాబు, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: