పట్టణ అభివృద్ధికి ప్రజలు సహకరించాలి - మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు19 సెప్టెంబర్, 202610:14 AM

స్టేషన్ ఘనపూర్ సెప్టెంబర్ 19 ప్రజాధ్వని :స్టేషన్ ఘనపూర్ పురపాలక అభివృద్ధికి ప్రజలు సహకరించాలని మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పారిశుద్ధ్యంపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకూడదని, తడి, పొడి చెత్తను వేరు వేరు డబ్బాలలో ఉంచి, చెత్త ట్రాక్టర్లు, ట్రాలీలు వచ్చినప్పుడు అందులో మాత్రమే వేయాలని సూచించారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో 43 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారని, సిబ్బంది కొరతతో కొంతమేర ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని తెలిపారు. ఇంకా 30 మంది సిబ్బంది అవసరం ఉందని పేర్కొన్నారు.

