ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    general

    సిపిఎం ఆధ్వర్యంలో సుందరయ్యకు ఘన నివాళి

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు19 మే, 202607:31 AM
    సిపిఎం ఆధ్వర్యంలో సుందరయ్యకు ఘన నివాళి
    చిల్పూర్ 19 మే ప్రజాధ్వని : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, కమ్యూనిస్టు ఉద్యమ ప్రముఖుడు పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతిని చిల్పూర్ మండలం లింగంపల్లి గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం గ్రామ కార్యదర్శి ఆవుల ప్రభాకర్ అధ్యక్షత వహించారు. మండల కమిటీ సభ్యులు అపారదాపు రాజు, కర్రె నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరై సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా పేదలకు న్యాయం జరగలేదని గుర్తించి భూస్వామ్య వ్యవస్థపై పోరాటం చేసిన మహానేత సుందరయ్య అని కొనియాడారు. వ్యక్తిగత ఆస్తులను పార్టీకి అంకితం చేసి, సాధారణ జీవనం గడిపిన నిజమైన కమ్యూనిస్టు నాయకుడిగా ఆయనను స్మరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: