ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    general

    విరిగిన కరెంటు స్తంభాల తొలగింపు – కొత్త స్తంభాల ఏర్పాటు

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు9 ఏప్రిల్, 202604:31 AM
    విరిగిన కరెంటు స్తంభాల తొలగింపు – కొత్త స్తంభాల ఏర్పాటు
    స్టేషన్ ఘనాపూర్, ఏప్రిల్ 9 ప్రజాధ్వని : స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ 1వ వార్డు పరిధిలో ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ కౌన్సిలర్ తాటికొండ మధు ముందడుగు వేశారు. ఎస్సీ కాలనీలో మాతంగి నరసయ్య ఇంటి వద్ద నుంచి సింగపురం నాగయ్య ఇంటి వరకు ఉన్న రెండు విరిగిన కరెంటు స్తంభాలు ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో వెంటనే స్పందించి వాటిని తొలగించి కొత్త స్తంభాలను ఏర్పాటు చేయించారు. ఈ పనులు మున్సిపల్ చైర్మన్ వినయ్ కుమార్ సహకారంతో చేపట్టినట్లు తెలిపారు. స్థానికులు చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించడంతో వార్డు ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తాటికొండ మధుతో పాటు కంటెస్టింగ్ కౌన్సిలర్ చింత బన్నీ, సింగపురం నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: