కార్మిక దినోత్సవం సందర్భంగా అమరవీరుడు వెలిగేటి వెంకటనారాయణ స్తూపం ఆవిష్కరణ
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు2 మే, 202604:04 AM

జనగామ జిల్లా చిల్పూర్ మండలం శ్రీపతిపల్లి గ్రామంలో కార్మిక దినోత్సవం సందర్భంగా సిపిఐ నాయకుడు, భూ పోరాటంలో అమరుడైన వెలిగేటి వెంకటనారాయణ స్మారక స్తూపాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఆయన జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు నిర్మించిన ఈ స్తూపాన్ని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ అనంతరం ఆవిష్కరించారు. అనంతరం కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ జెండాను ఎగరవేశారు.

ఈ సందర్భంగా వెంకటనారాయణ కుమార్తెలు, కుటుంబ సభ్యులు ఆయన పోరాట గాథలను, ప్రజల కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు. మీడియా ముఖంగా ఆయన జ్ఞాపకాలను పంచుకుంటూ, ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు వెలిగేటి వజ్రమ్మ–లక్ష్మీనారాయణ, సరస్వతి–వెంకట్రాజం, శ్రీదేవి–చంద్రమౌళి, మాధవి–సుభాస్ పరమేశ్వరి పాల్గొన్నారు. అలాగే జిల్లా సహాయ కార్యదర్శి ఆది సాయన్న, రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు పాతూరి సుగుణమ్మ, డిహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షుడు పైసరాములు, చిల్పూర్ మండల కార్యదర్శి బోనగిరి కుమారస్వామి, డిహెచ్పిఎస్ మండల కార్యదర్శి ఇల్లందుల లింగయ్య, కట్ట ఎల్లయ్య తదితరులు హాజరయ్యారు.
