చిన్నారి జేసివికకు నూతన వస్త్రాలు అందజేసి ఆశీర్వదించిన పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు13 నవంబర్, 202602:06 PM
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తిరుమలాయపల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ రాయపర్తి మండల అధ్యక్షుడు వశపాక కుమార్, జ్యోతి దంపతుల కుమార్తె జేసివిక నూతన వస్త్రాలంకరణ కార్యక్రమం సందర్భంగా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి చిన్నారిని…

రాయపర్తి, నవంబర్ 13 (ప్రజాధ్వని):వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తిరుమలాయపల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ రాయపర్తి మండల అధ్యక్షుడు వశపాక కుమార్, జ్యోతి దంపతుల కుమార్తె జేసివిక నూతన వస్త్రాలంకరణ కార్యక్రమం సందర్భంగా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి చిన్నారిని ఆశీర్వదించారు. కార్యక్రమానికి ముందస్తుగా హాజరైన ఆయన చిన్నారి జేసివికకు ఆశీస్సులు అందజేసి, ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ తరఫున నూతన వస్త్రాలను బహూకరించారు. చిన్నారి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల బీఆర్ఎస్ నాయకులు లేతకుల రంగారెడ్డి, తాళ్లపెల్లి సంతోష్ గౌడ్, చందు రాము యాదవ్, సంకినేని ఎల్లస్వామి, పెందోట శివ తదితరులు పాల్గొన్నారు.
