ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    మురికి కాలువను శుభ్రం చేయించిన మున్సిపల్ చైర్మన్

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు26 ఆగస్టు, 202611:34 AM
    మురికి కాలువను శుభ్రం చేయించిన మున్సిపల్ చైర్మన్
    స్టేషన్‌ఘన్‌పూర్ ఆగష్టు 26 ప్రజాధ్వని : మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో మురికి కాలువ పూడుకుపోయి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం మున్సిపల్ చైర్మన్ వినయ్‌కుమార్ దృష్టికి రావడంతో వెంటనే స్పందించారు. సమస్యాత్మక ప్రాంతాన్ని పరిశీలించి, జేసీబీ సహాయంతో మురికి కాలువలో పేరుకుపోయిన వ్యర్థాలు, మట్టిని తొలగించి శుభ్రం చేయించారు. కాలువ శుభ్రం చేయడంతో మురుగునీటి సమస్యకు పరిష్కారం లభించిందని కాలనీవాసులు తెలిపారు. సమస్యపై వెంటనే స్పందించి చర్యలు తీసుకున్న మున్సిపల్ చైర్మన్ వినయ్‌కుమార్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 3వ వార్డు కౌన్సిలర్ గుర్రం హైమ-రమేష్ తదితరులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: