ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    గణేష్ నిమజ్జనానికి ముందస్తు ఏర్పాట్లు

    • నష్కల్, రాజవరం, మల్కాపూర్ చెరువులను పరిశీలించిన అధికారులు
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు21 సెప్టెంబర్, 202602:29 PM
    గణేష్ నిమజ్జనానికి ముందస్తు ఏర్పాట్లు
    చిల్పూర్ 21 సెప్టెంబర్ ప్రజాధ్వని : చిల్పూర్ మండలంలోని రాజవరం రిజర్వాయర్ కట్టపై వినాయక నిమజ్జన ఏర్పాట్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. సోమవారం రాజవరం విద్యుత్ ఉపకేంద్ర పరిధిలోని నష్కల్ చెరువు, రాజవరం చెరువు, మల్కాపూర్ చెరువు ల వద్ద నిమజ్జన పాయింట్లను రెవెన్యూ,పోలీస్,విద్యుత్ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు.చెరువుల వద్ద నీటి మట్టం, నిమజ్జనానికి అనుకూలత, రహదారుల పరిస్థితి, విద్యుత్ దీపాలు, బారికేడ్లు, క్రేన్ల ఏర్పాటు, భద్రతా చర్యలపై క్షేత్రస్థాయిలో చర్చించారు. నిమజ్జన రోజు భక్తులకు, వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్, రెవెన్యూ, పంచాయతీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులు సూచించారు.గణేష్ మండపాల నిర్వాహకులు కూడా నిమజ్జన సమయంలో నిబంధనలు పాటించి, అధికారులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులతో పాటు తహసిల్దార్ విజయ్ కుమార్,ఇంచార్జ్ ఎంపీడీవో కిరణ్ ప్రసాద్, జనగామ రూరల్ సీఐ జి. వేణు, ఎస్ఐ నవీన్ కుమార్ పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: