ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    మాదిగ మహారాజుల శోభాయాత్రను విజయవంతం చేయాలి

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు19 నవంబర్, 202610:20 AM

    మాదిగ జాగృతి సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 22న (ఆదివారం) వరంగల్‌ పట్టణ కేంద్రంలో నిర్వహించనున్న మాదిగ మహారాజుల శోభాయాత్రను అట్టహాసంగా నిర్వహించనున్నట్లు సంఘం నాయకులు తెలిపారు.

    మాదిగ మహారాజుల శోభాయాత్రను విజయవంతం చేయాలి
    స్టేషన్‌ ఘన్‌పూర్‌ నవంబర్ 19 ప్రజాధ్వని : మాదిగ జాగృతి సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 22న (ఆదివారం) వరంగల్‌ పట్టణ కేంద్రంలో నిర్వహించనున్న మాదిగ మహారాజుల శోభాయాత్రను అట్టహాసంగా నిర్వహించనున్నట్లు సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీలకతీతంగా నియోజకవర్గంలోని మాదిగలందరూ అధిక సంఖ్యలో హాజరై శోభాయాత్రను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శోభాయాత్రకు సంబంధించిన పోస్టర్‌ను స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గలో కేంద్రంలో నాయకులు ఇల్లందుల సుదర్శన్‌ చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాదిగ జాగృతి సంఘం జాతీయ కన్వీనర్‌ భీంరావ్‌ మహారాజ్‌, చిల్పూర్‌ మండల కన్వీనర్‌ కవీశ్వర్‌ మహారాజ్‌ పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: