ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    చిల్పూర్

    బీజేపీ చిల్పూర్ మండల నాయకుల ముందస్తు అరెస్టు

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు14 నవంబర్, 202604:27 AM

    హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడాన్ని బీజేపీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి.

    బీజేపీ చిల్పూర్ మండల నాయకుల ముందస్తు అరెస్టు
    చిల్పూర్, నవంబర్ 14 ప్రజాధ్వని : హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడాన్ని బీజేపీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. ఇందులో భాగంగా చిల్పూర్ మండల బీజేపీ అధ్యక్షుడు గంటె ఉపేందర్ యాదవ్, జిల్లా నాయకుడు బాల్నే శ్రీనివాస్ గౌడ్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు నిర్బంధించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, రాజ్యాంగం కల్పించిన హక్కులను అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఖరి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. పోలీసులు నిర్బంధించిన గంటె ఉపేందర్ యాదవ్, బాల్నే శ్రీనివాస్ గౌడ్‌తో పాటు ఇతర బీజేపీ నాయకులు, కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: