ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    మండల వార్తలు

    ఆలయ అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలి

    • ఎమ్మెల్యే యశస్విని రెడ్డి స్పందించాలి
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు10 అక్టోబర్, 202607:54 AM
    ఆలయ అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలి
    రాయపర్తి, అక్టోబర్ 10 ప్రజాధ్వని: రాయపర్తి మండలంలోని వెంకటేశ్వరపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని బీఆర్ఎస్ మండల నాయకులు డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో రూ.10 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించారని తెలిపారు. పనులు సగం పూర్తికాగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన కోనేరు, శివాలయం, మాడ వీధులు, ఫంక్షన్‌హాల్‌ తదితర పనులు అసంపూర్తిగా ఉన్నాయని నాయకులు తెలిపారు. కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించకపోవడం వల్లే పనులు నిలిచిపోయాయనే విషయాన్ని ప్రస్తావిస్తూ, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి వెంటనే స్పందించాలని కోరారు. సంబంధిత కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించి, నిలిచిపోయిన పనులను పునఃప్రారంభించి ఆలయ అభివృద్ధిని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు మునావత్ నర్సింహ నాయక్, మాజీ ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ కుందూరు రామచంద్రారెడ్డి, మాజీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, సన్నూర్ క్లస్టర్ ఇన్‌చార్జి ఐత రామచందర్, లేతకుల రంగారెడ్డి, తాళ్లపెల్లి సంతోష్ గౌడ్, ఎలమంచి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సర్పంచులు చిన్నపాక రజిత రాంబాబు, గుగులోత్ రమేష్ నాయక్, చందు రామ్ యాదవ్, గబ్బేట యాకయ్య, సంకినేని ఎల్లస్వామి, చందు సతీష్, గూబ అశోక్, జీవన్, ఐత రవి, నలామాష సారయ్య, గూబ ఎల్లయ్య, జగన్, చీకటి కర్ణాకర్, పోతుల కొమురుమాళ్లు, వేణు, పొన్నం కుమార్, ఎనగందుల సామ్రాట్ తదితరులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: