ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    ఉత్తమ సర్పంచ్ అవార్డ్ అందుకున్న సర్పంచ్ తిరుపతమ్మ

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు15 ఆగస్టు, 202601:35 PM
    ఉత్తమ సర్పంచ్ అవార్డ్ అందుకున్న సర్పంచ్ తిరుపతమ్మ
    చిల్పూర్ ఆగష్టు 15 ప్రజాధ్వని: చిల్పూర్ మండలం చిన్న పెండ్యాల గ్రామ అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో చూపిన చొరవకు గాను చిన్నపెండ్యాల గ్రామ సర్పంచ్ తిరుపతమ్మ ఉత్తమ సర్పంచ్ అవార్డు` అందుకున్నారు. జిల్లా స్థాయి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జరిగిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు తిరుపతమ్మ గారిని సత్కరించి ప్రశంసా పత్రం మరియు జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా తిరుపతమ్మ మాట్లాడుతూ, "ఈ అవార్డు నాకు ఒక్కదానికే కాదు, చిన్నపెండ్యాల గ్రామ ప్రజలందరికీ, గ్రామ పంచాయతీ సభ్యులకు, అధికారులకు దక్కిన గౌరవం. గ్రామంలో పారిశుద్ధ్యం, మంచినీరు, సిసి రోడ్లు, హరితహారం కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసినందుకు ఈ గుర్తింపు వచ్చింది" అని అన్నారు. "రాబోయే రోజుల్లో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసి, ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తాను" అని భరోసా ఇచ్చారు. గ్రామ ప్రజలు, పంచాయతీ సభ్యులు తిరుపతమ్మ కి అభినందనలు తెలిపారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: