ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    సద్దుల సంబరం.. గౌరమ్మ వైభవం!

    • ఘన్‌పూర్‌లో అంబరాన్నంటిన బతుకమ్మ వేడుకలు
    • నాలుగు అడుగుల భారీ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణ
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు19 అక్టోబర్, 202601:49 AM

    స్టేషన్‌ ఘన్‌పూర్‌ పురపాలక పరిధిలో సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పట్టణంలోని 18 వార్డుల్లో ఆడపడుచులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి పండుగ సంబరాల్లో మునిగిపోయారు.

    సద్దుల సంబరం.. గౌరమ్మ వైభవం!
    స్టేషన్‌ ఘన్‌పూర్‌, అక్టోబరు 18 (ప్రజాధ్వని):స్టేషన్‌ ఘన్‌పూర్‌ పురపాలక పరిధిలో సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పట్టణంలోని 18 వార్డుల్లో ఆడపడుచులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి పండుగ సంబరాల్లో మునిగిపోయారు. సంప్రదాయ దుస్తులు ధరించి, తీరొక్క పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ సందడి చేశారు. విద్యుత్‌ దీపాల కాంతులు, డీజే పాటల హోరుతో చాగల్లు, శివునిపల్లి, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ప్రాంతాలు పండుగ శోభను సంతరించుకున్నాయి. ముఖ్యంగా పోలీస్‌స్టేషన్‌ సమీపంలో శ్రీరాముల శివ పేర్చిన నాలుగు అడుగుల భారీ బతుకమ్మ, గౌరమ్మ ప్రతిమతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తీరొక్క పూలతో అందంగా అలంకరించిన ఈ భారీ బతుకమ్మను తిలకించేందుకు మహిళలు, స్థానికులు ఆసక్తి చూపారు. మరోవైపు వేడుకలకు సంబంధించి మున్సిపల్‌ చైర్మన్‌ తాటికొండ వినయ్‌కుమార్‌, కమిషనర్‌ రాధాకృష్ణ ఆధ్వర్యంలో అధికారులు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేశారు. పారిశుధ్యం, విద్యుత్‌ దీపాల ఏర్పాటు, బతుకమ్మల నిమజ్జనానికి అవసరమైన సౌకర్యాలను కల్పించి, ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. మహిళలు సంప్రదాయబద్ధంగా బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొని, అనంతరం పూల బతుకమ్మలను చెరువుల్లో నిమజ్జనం చేయడంతో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా ముగిశాయి. పట్టణమంతా పండుగ సందడి నెలకొనడంతో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవం మరోసారి వెల్లివిరిసింది.
    మీ స్పందన:

    షేర్ చేయండి: