జర్నలిస్టు దినోత్సవం సందర్భంగా ఘనంగా సన్మానం
- స్టేషన్‌ఘన్‌పూర్‌లో కేక్ కట్ చేసి సంబురాలు
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు6 సెప్టెంబర్, 202603:19 PM

స్టేషన్‌ఘన్‌పూర్ 06 ప్రజాధ్వని : సమాజంలో జరుగుతున్న వాస్తవాలను నిరంతరం వెలికితీస్తూ, ప్రజా సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు పేర్కొన్నారు. జర్నలిస్టు దినోత్సవాన్ని పురస్కరించుకుని జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో బీఆర్ఎస్ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జర్నలిస్టులతో ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం జర్నలిస్టులను శాలువాలతో ఘనంగా సన్మానించి గౌరవించారు. ప్రజాహితం కోసం నిరంతరం శ్రమిస్తూ, సమాజానికి నిజాలను తెలియజేస్తున్న మీడియా ప్రతినిధులను సన్మానించడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు నాయకులు తెలిపారు. జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణలో ముఖ్యమైన బాధ్యత నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కంటెస్టెడ్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
